మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన కొత్త ఫిల్మ్ కి సంబంధించి ఇంకా సైన్ చేయకపోవడంతో చరణ్ అభిమానుల సైతం తమ హీరో తరువాత ఎలాంటి సినిమా చేస్తాడు ? ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరై ఉంటారు ? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ అంటూ మంచి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఎట్టకేలకు తన తరువాత సినిమాని చరణ్ తో ఫిక్స్ చేసుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
నిజానికి వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేశాడు. మహేష్ తో వంశీకి మంచి సాన్నిత్యం ఉన్నా.. మహేష్ మాత్రం వంశీతో సినిమా చేయడానికి మహేష్ ఇంట్రస్ట్ చూపించలేదు. కానీ, వంశీ తన కథతో రామ్ చరణ్ ను ఒప్పించి సినిమా సెట్ చేసుకున్నాడు. దిలారాజు నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందట. కాకపోతే, ఈ సినిమా ఇప్పట్లో ఉండదట. వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుందని సమాచారం. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.