విలక్షణ దర్శకుడు వంశీ తన 25వ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం అజ్మల్ అమీర్ ను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఈ దర్శకుడు “లేడీస్ టైలర్” , “అన్వేషణ”, ” ఏప్రిల్ 1 విడుదల” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అజ్మల్ గతంలో “రంగం”,”రచ్చ” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో హీరోగా అజ్మల్ కి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో అజ్మల్ సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం. దీని గురించిన విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. పూర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం వి రఘు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చక్రి సంగీతమందిస్తుండగా ఈ చిత్రం ఒక కాలనీ లో ఉండే ప్రజలు వారి మధ్య బంధాలు ఎలా ఉంటాయనేది చూపెడుతుంది అని సమాచారం. ఈ చిత్రం కోసం చక్రి ఇపతికె రెండు పాటలను రికార్డ్ చేశారు.