ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “వకీల్ సాబ్” టీజర్ కోసమే పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మూడేళ్ళ సుదీర్ఘ విరామంతో పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు సెట్టయ్యాయి. మరి అలాగే ఇదే క్రమంలో ఈ టీజర్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో అభిమానులు కూడా హంగామా ఓ రేంజ్ లో షురూ చేసేసారు.
మరి ఇప్పుడు అలానే వకీల్ సాబ్ టీజర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్స్ లోకి వచ్చేసింది. అలాగే ఈ టీజర్ తో భారీ రికార్డులు సెట్ చెయ్యాలని గట్టిగానే ఫిక్స్ అయ్యారు. కానీ అది ఎంత వరకు ఆ అంచనాలను రీచ్ అవుతుందో అన్నది చూడాలి. ఇప్పటికే కేవలం నిమిషంలోపే టీజర్ కట్ ఉంటుందని టాక్ వచ్చింది. మరి అందులోనే పవన్ అభిమానులు ఆశించే కంటెంట్ ను చూపిస్తారా లేదా అన్నది చూడాలి.
అలాగే ఈ టీజర్ లోనే థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా మంచి అంచనాలు సెట్ చేసుకున్నారు. మరి వచ్చే 14న వచ్చే టీజర్ ఎలాంటి సెన్సేషన్ ను నమోదు చేస్తుందో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.