మహేష్ కోసం బన్నీ విలన్..?

మహేష్ బాబు ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా దొరికిన విరామాన్ని ఇంటిలో తన పిల్లలతో గడుపుతూ, ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. ఇక నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇంత వరకు స్పష్టం కాలేదు. ఐతే ఆయన గీత గోవిందం దర్శకుడు పరుశురాంకే ఫిక్సయ్యారని తెలుస్తుంది. కొద్దిరోజులలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. ఈ చిత్రం గురించిన మరో ఆసక్తి వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారట. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఉపేంద్ర బెటర్ ఛాయిస్ గా దర్శకుడు భావిస్తున్నాడట.

ఒకప్పుడు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్ర స్ట్రెయిట్ మూవీస్ కూడా చేశారు. ఈ మధ్య ఆయన ఐ లవ్ యూ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఇక ఆయన 2015లో త్రివిక్రమ్- బన్నీ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ రోల్ చేయడం జరిగింది. ఇదే ఆయన ఈమధ్య కాలంలో తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ. సరిలేరు నీకెవ్వరు మూవీతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.

Exit mobile version