కేరళలో “ఊ కొడతారా ఉలిక్కి పడతారా”


బాల కృష్ణ,మంచు మనోజ్ మరియు దీక్ష సెత్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” కేరళలో చిత్రీకరణ జరుపుకోనుంది. ప్రస్తుతం చిత్ర దర్శకుడు శేఖర్ రాజ మరియు చాయాగ్రాహకుడు ప్రదేశాలను ఎంపిక చెయ్యడానికి వెళ్ళారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది ఈ మధ్యనే హైదరాబాద్ లో చిత్ర క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ ఫైట్ చాలా బాగా వచ్చింది అంటున్నారు. బొబో శశి సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని ఒకేసారి తమిళ మరియు తెలుగు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. రెండు వెర్షన్లు ఈ వేసవి కి విడుదల కానున్నాయి.

Exit mobile version