ఢిల్లీ సంఘటనపై రెండు సినిమాలను తీస్తున్న టాలీవుడ్

Nirbhaya-Bharatham-and-Nish
దేశవ్యాప్తంగా నివ్వెరపోయి తలదించుకున్న నిర్భయ అత్యాచార సంఘటనపై టాలీవుడ్ రెండు సినిమాలు తీయనుంది. ఇందులో ఒకటి ‘నిర్భయ భారతం’. సామాజిక సేవల కోసం సినిమాలను తీసే ఆర్. నారాయణమూర్తి నిర్మాణంలో ఈ చిత్రం రానుంది. ఢిల్లీ సంఘటనకు కాస్త ఫిక్షన్ ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకుని కొంత మంది ప్రముఖుల ముందు ప్రదర్శింపబడి వారి మన్ననలను అందుకుంది. వీరిలో పూరి జగన్నాధ్, కీరవాణి, బి.ఏ రాజు మరియు బి. జయ వున్నారు. ఇక ఈ సంఘటన పై రానున్న రెండో సినిమా ‘నషా’. ప్రస్తుత పరిస్థితులలో ముగువ దుస్థితిని తెలియజెప్పే రీతిలో ఈ సినిమా సాగుతుంది. అనన్య మరియు కళ్యాణి ముఖ్యపాత్రధారులు. రమణ గడ్డం ఈ సినిమాకు దర్శకుడు. ధనరాజ్ నిర్మాత

సెప్టెంబర్ లో ఈ రెండు సినిమాలూ విడుదలకానున్నాయి. నిర్మాతలు కూడా ఇటువంటి ప్రయత్నాలకు ముందడుగు వేస్తున్నారు. తామనుకున్న సినిమాను ప్రేక్షకులకు ఎలా న్యాయం చేస్తారు అన్నది త్వరలో చూడాలి

Exit mobile version