యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “థగ్ లైఫ్”. అయితే ఎన్నో ఏళ్ళు తర్వాత కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి కానీ తీరా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వచ్చింది.
అయితే ఈ సినిమాలో ఉన్న చాలానే డిజప్పాయింటింగ్ అంశాల్లో బాగా నెగిటివ్ తెచ్చుకున్న అంశం ఏదన్నా ఉంది అంటే అది హీరోయిన్ త్రిష పాత్ర అని చెప్పాలి. ఆమె రోల్ మాత్రమే కాకుండా ఆమెతో ఉన్న పలు సన్నివేశాలు పలు పాత్రల సంబంధాలు చూసి ఆడియెన్స్ కి వెగటు కలిగింది అని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో త్రిష మాత్రం ఈ అంశంలో బలైపోయింది అని చెప్పక తప్పదు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా కమల్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.