‘కాంతార చాప్టర్ 1’ టాలీవుడ్ టాప్ స్టార్స్ అండదండలు..!

Kantara-Chapter-1

డివోషనల్ కంటెంట్‌తో కూడిన స్పెషల్ కథనం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కాంతార’ మూవీ తర్వాత, రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌గా ‘కాంతార : ఛాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు ప్రేక్షకుల్లోనూ దీనిపై మంచి ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోలు తమ మద్దతు ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించి డివోషనల్ అంశాలతో తీర్చిదిద్దిన రిషబ్ శెట్టి ని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరై మరింత హైప్‌ను పెంచారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యాక్షన్ డ్రామాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం, సరిహద్దులను దాటి మనుషులను కలిపే కళను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించడం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. ఇలా టాలీవుడ్‌లోని అగ్ర తారల మద్దతుతో, సంప్రదాయ-సంస్కృతుల ఆధారంగా రూపొందిన ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version