ప్రయోగాత్మక చిత్రాల బాటలో టాలీవుడ్

ప్రయోగాత్మక చిత్రాల బాటలో టాలీవుడ్

Published on Sep 1, 2013 4:00 AM IST

Nayana-and-panchami

కాస్త ఆలస్యంగా అయినా టాలీవుడ్లో కొందరు దర్శకులు ప్రయోగాత్మక చిత్రాలు చేసి అన్ని విధాలా లాభపడుతున్నారు. ఇప్పుడు అలంటి రెండు సినిమాలు త్వరలో విడుదలకానుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమాల పేర్లు ‘పంచమి’ మరియు ‘నయన’. ‘పంచమి’ సినిమాలో పాత్రే సినిమాలో ఏకైక పాత్రగా కొనసాగుతుంది. సుజాత బౌర్య దర్శకత్వంలో డి శ్రీకాంత్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగావుంది

మరో చిత్రం ‘నయన’ సినిమాలో నటాషా ప్రధాన పాత్రధారి. చంద్ర మూవీస్ సంస్థ ఈ సినిమాను దర్శక, నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ సినిమా ఆడియో నిన్ననే విడుదలైంది. ఈ రెండు సినిమాలూ త్వరలో విడుదలై మంచి ఫలితాలని రాబట్టుకుంటే మరిన్ని సినిమాలు మనకు వచ్చే అవకాశాలు వున్నాయి

తాజా వార్తలు