నల్లమల నుండి టైటిల్ సాంగ్ విడుదల

నల్లమల.. ఈ పేరు వినగానే ఎన్నో గుర్తొస్తాయి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న చిత్రం “నల్లమల”. నల్లమల చుట్టూ ఉన్న ఎన్నో చీకటి కోణాలను స్పృశిస్తూ.. అక్కడి వారి జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్న అనేకమంది మోసాలను బట్టబయలు చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ఇది. కథే హీరోగా రూపొందుతున్న నల్లమల మూవీ నుంచి మొదటి వీడియో సాంగ్ విడుదల అయింది. ప్రముఖ నటుడు నాజర్ చేతుల మీదుగా ఈ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నాజర్ మాట్లాడుతూ.. “పాట అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా బావుంటుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించిన ఫీలింగ్ వచ్చింది. గొప్ప కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు.

ప్రస్తుతం శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version