వాయిదా పడ్డ విజయ్ ‘తుపాకి’


తమిళ్ హీరో విజయ్ హీరోగా , విభిన్న చిత్రాల దర్శకుడు ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘తుపాకి’. ఈ సినిమాని ముందుగా నవంబర్ 9న విడుదల చేయాలనుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాని నవంబర్ 13న విడుదల చేయనున్నామని ఈ చిత్ర తెలుగు హక్కులు దక్కించుకున్న నిర్మాత శోభారాణి తెలిపారు. ముంబైలో జరిగిన టెర్రరిస్టుల అరాచకాల నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో విద్యుత్ టెర్రరిస్ట్ గా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించారు. మొదటి సారి విజయ్ మరియు మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై తమిళంలో ఆకాశాన్ని తాకేలా అంచనాలున్నాయి. విజయ్ ఈ సినిమాతో హిట్ కొట్టి తెలుగులో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నారు.

Exit mobile version