‘నాయకుడు’ని మించి ‘థగ్ లైఫ్’.. కమల్ ప్రామిస్ వైరల్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా నటించిన ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో లెజెండరీ దర్శకుడు మణిరత్నం కలయికలో చేసిన చిత్రం “నాయకుడు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం తర్వాత మళ్ళీ వీరు కలిసి సినిమా చేసేందుకు సుమారు నాలుగు దశాబ్దాల కాలం పట్టింది. అయితే అలాంటి క్లాసిక్ తర్వాత మళ్ళీ సినిమా అంటే అంచనాలు అంతే రీతిలో ఉంటాయి.

మరి ఇలా వస్తున్న చిత్రమే ‘థగ్ లైఫ్’. అయితే ఈ చిత్రం నాయకుడుకి మించి ఉంటుంది అని కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇపుడు వైరల్ గా మారింది. కేవలం తాను ప్రమోషన్స్ చేయాలని రావడం లేదని తన మనసు లోతు లోనుంచి ఈ సినిమాకి అవసరం అని చేస్తున్నాను అని తెలిపారు. అంతే కాకుండా ఖచ్చితంగా ఈ చిత్రం నాయకుడు ని మించి ఉంటుంది నమ్మండి అని కమల్ చాలా కాన్ఫిడెంన్ గా చెప్పడం అనేది సినిమాపై మరిన్ని అంచనాలు రేకెత్తించింది.

Exit mobile version