అమలా పాల్ చూడటానికి స్లిమ్ గా, అందంగా ఉండే ఈ భామకి తెలుగులో చెప్పుకోదగ్గా సినిమా ఏదన్నా ఉంది అంటే అది ‘లవ్ ఫెయిల్యూర్’ మాత్రమే. అయినా సరే ఈ మలయాళీ కుట్టికి తెలుగులో పెద్ద హీరోల సరసన ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి అమలా పాల్ ని మీరు తెరపై అందంగా కనపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అడిగితే ‘ మన దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు కథ మరియు అందులోని మన పాత్రని బాగా అర్థం చేసుకోవాలి. ఆ రెండు విషయాలు ఎంత అర్థం చేసుకుంటే అంత అందంగా కనిపిస్తాం. ఎప్పుడైతే మనం చేస్తున్న పాత్రలో లీనమైపోతామో అప్పుడు మనం అందంగా కనపడతాం మరియు నటన కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. సెట్ కెల్లామా మేకప్ వేసుకున్నామా అని అనుకునే మనస్తత్వం కాదని’ అమలా పాల్ జవాబిచ్చారు. ప్రస్తుతం అమలా పాల్ తెలుగులో ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ మరియు ‘జెండా పై కపిరాజు’ లాంటి క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది.