‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న ‘ఆర్ సి 16’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐతే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్ ని చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపించాయి. పైగా ఇప్పటికే రణ్‌బీర్‌కు దర్శకుడు కథ కూడా వినిపించాడని.. రణ్ బీర్ కూడా ‘ఆర్ సి 16’కి ఓకే చెప్పారని ఆ రూమర్స్ సారాంశం. కానీ, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.
రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయడం లేదని తెలుస్తోంది. కాకపోతే, సినిమాలో కథకి అనుగుణంగా ఓ ఐదు నిమిషాల పాటు ఉండే ఓ స్పెషల్ పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ ను ఒప్పించే పనిలో ఉంది టీమ్. కానీ, ఇంకా ఏ హీరోని టీమ్ అప్రోచ్ అవ్వలేదని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించబోతుంది.
ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.