రాష్ట్రరాజకీయాలలో వారం రోజులుగా జరుగుతున్నా మార్పులను దృష్టిలో పెట్టుకుని సినిమా నిర్మాతలు ఈ వారం విడుదలయ్యే సినిమాలను వచ్చే వారానికి వాయిదావెయ్యాలనుకుంటున్నారు. సీమాంధ్ర అధికారులు ఇప్పటికే రేపు(ఫిబ్రవరి 11న) బంధ్ ప్రకటించగా ఒకవేళ తెలంగాణా పై నిర్ణయం స్పష్టమైతే వీరి ప్రభావం మరింత ఎక్కువగా వుండనుంది
ఒకవేళ సీమాంధ్రులకు అనుకూలంగా ఎటువంటి నిర్ణయమైనా ఇస్తే తెలంగాణా ప్రాంతంలో గొడవలు జరిగి తిరిగి అవి కూడా విడుదలలను ఇబ్బందిపెడతాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు రేపు సాయింత్రానికి తమ నిర్ణయం తెలుపనున్నారు
తెలుగు సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఒక విధంగా గడ్డుకాలమనే చెప్పాలి