అది పెద్ద టర్నింగ్ పాయింట్..ఎమోషన్ అయిన బన్నీ.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే అదిరిపోయే డాన్సులు సరికొత్త డ్రెస్సింగ్ మరియు హైర్ స్టయిల్స్ మొదటగా గుర్తుకు వస్తాయి. మరి అలాగే బన్నీ కొన్ని విషయాల్లో అనేక సార్లు రిస్కులు కూడా తీసుకున్నాడు. అలా ఓసారి బన్నీకు పర్సనల్ గా ఓ ఘటన పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యిందని సామ్ జామ్ షో లో చెప్పారు. వారి స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో కొత్త సంవత్సరం సందర్భంగా ఎపిసోడ్ ను ప్లాన్ చేసారు.

మరి దాని నుంచి విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో బన్నీ ఈ విషయాన్ని చెప్పారు. “జులాయి” సినిమా టైం లో తన భుజానికి ఒక గాయం అయ్యిందని దానికి పై నుంచి కట్ చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పగా మరి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగితే సింపుల్ గా 6-8 నెలలు పడుతుంది అని సింపుల్ గా చెప్పేశారని ఆ టైం రెండు సాంగ్స్ డాన్స్ చెయ్యలేకపోయానని బన్నీ ఒకింత ఎమోషనల్ అయ్యాడు.

Exit mobile version