టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో “ఆచార్య” అనే భారీ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. మంచి హైప్ ఉన్న ఈ చిత్రం లైన్ లో ఉండగానే చిరు రెండు రీమేక్ సినిమాలను కూడా పెట్టుకున్నారు. మరి వాటిలో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ “లూసిఫర్” కూడా ఒకటి. దీనితో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఏదొక మేజర్ చేంజ్ వస్తూనే ఉంది. అలా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా చెంతకు ఈ సినిమా రావడంతో దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో కీలక రోల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి ఆ రోల్ కు మన టాలీవుడ్ లేటెస్ట్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పేరు ఫైనలైజ్ అయ్యినట్టు తెలుస్తుంది. తాను ఆ చిత్రంలో పృథ్వీ రాజ్ పాత్రను పోషించనున్నాడని టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.