‘కుబేర’లో ఈ సాంగ్ సర్ప్రైజ్ చేస్తుందా!?

కోలీవుడ్ స్టార్ ధనుష్, అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానురాలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ధనుష్ నుంచి పలు వేరియేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరి తనపై లేటెస్ట్ గా విడుదల చేసిన అమ్మ పాట (నా కొడుకా) చాలా తక్కువ మందే విని ఉండొచ్చు.

కానీ థియేటర్స్ లో ఈ సాంగ్ సహా అందులో ధనుష్ పెర్ఫామెన్స్ లు పీక్ లో ఉండేలా ఉన్నాయని చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ తన మార్క్ ఎమోషనల్ సాహిత్యం సంగీతాలని చూపించి తన టేస్ట్ ఏంటో మరోసారి నిరూపించారు. ఇలా ఖచ్చితంగా కుబేరలో ఈ సాంగ్ మాత్రం ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ గా మారే ఛాన్స్ ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలో ఎమోషన్స్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కుబేర లో ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు జూన్ 20 వరకు ఆగాల్సిందే.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version