మన తెలుగు సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్ లు అంటే ప్రత్యేకమైన అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. అది ఎలాంటి హీరో ఎలాంటి దర్శకుడు అయినా ఆ కాంబో సెట్టయ్యింది అంటే వారియూ ట్రాక్ రికార్డులో అంతకు ముందు ఉన్న ఫలితాలు లెక్కలోకి రావు.
అలా సరికొత్త అంచనాలతో మంచి అంచనాలు సెట్ చేసుకునే కాంబోలలో మాస్ మహారాజ్ రవితేజ మరియు గోపీచంద్ మలినేని లది కూడా ఒకటి. అయితే ఈ సాలిడ్ కాంబో నుంచి ఇప్పటి వరకు డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి.
మరి వాటి బాటలోనే లేటెస్ట్ మాస్ ఎంటర్టైనెర్ “క్రాక్”తో కూడా సాలిడ్ హిట్ అందుకొని స్యూర్ షాట్ మాస్ హ్యాట్రిక్ కొట్టేసారు. దీనితో రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని సింబాలిక్ గా చూపిస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. అలాగే ఠాగూర్ మధు ఈ చిత్రానికి నిర్మాణం వహించారు.
#Krack ???????????? pic.twitter.com/HdBpMyJW1H
— Gopichandh Malineni (@megopichand) January 10, 2021