మన టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోల్లో ఇంటెర్నేషనల్ స్టాండర్డ్ కటౌట్స్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ కూడా ఒకరు. తన హ్యాండ్సమ్ పర్సనాలిటీకు గాని తన లుక్స్ పరంగా కానీ ప్యూర్ హాలీవుడ్ లెవెల్ కటౌట్ లో మహేష్ కనిపిస్తాడు. ఇది వాస్తవం.
మరి అలా ఉండే మహేష్ ను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసాం. అందుకు తగ్గట్టుగానే మహేష్ మంచి ప్రయోగాలను కూడా చేశారు. కానీ ఒక్క దర్శకుడిపై మాత్రం మహేష్ ఫ్యాన్స్ భారం వేసేసారు. అతడే దర్శక ధీరుడు రాజమౌళి. మహేష్ తన పర్సనాలిటీకి తగ్గట్టుగా స్టన్నింగ్ లుక్స్ తో చాలా సినిమాల్లోనే కనిపించారు.
కానీ తాను చేసే పలు యాక్షన్ షాట్స్ కు ఇప్పుడు చేస్తున్న సినిమాలకు అది చాలదని మహేష్ అభిమానులు అభిప్రాయం పడుతున్నారు. ఇదే అయితే ఆ మధ్య మహేష్ మరియు రణ్వీర్ లతో వచ్చిన యాడ్ చూసి అయితే మరింత అసహనం వ్యక్తం చేసారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో అయితే మహేష్ నుంచి ఒక పర్ఫెక్ట్ హాలీవుడ్ టైప్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రాజమౌళి నుంచే ఆశిస్తున్నారు. అంతే కాకుండా ఆ లెవెల్ ప్రాజెక్ట్ ను రాజమౌళి అయితేనే హ్యాండిల్ చెయ్యగలరని బలంగా నమ్ముతున్నారు. మరి ఆ టైప్ లో కనుక రాజమౌళి ఏమన్నా ప్లాన్ గీస్తే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం అని చెప్పాలి.