‘రామాయణ’లో సెపరేట్ గా ఇవేం లేవా?

ప్రస్తుతానికి ఇండియన్ సినిమా దగ్గరే అత్యంత ఖరీదైన సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ మేకర్స్ తెరకెక్కిస్తున్న “రామాయణం” అని చెప్పవచ్చు. 4000 వేల కోట్ల బడ్జెట్ తో ఇండియన్ సినిమా నుంచి మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ సినిమాగా హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ తో కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే రామాయణ మహాగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఓ ఊహించని టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీనితో ఈ రామాయణంలో మాత్రం ఎలాంటి పాటలు ఉండవని చెబుతున్నారు. కేవలం బిట్ సాంగ్స్ సందర్భానుసారం వచ్చేవి ఉంటాయి తప్పితే ప్రత్యేకంగా ఇరికించి పెట్టే సాంగ్ ఏవి ఉండవని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతమేరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్ తో పాటుగా ఏ ఆర్ రెహమాన్ కూడా సంగీతం అందిస్తుండగా రణబీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణ పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version