ఆ రెండు సినిమాలకు చాలా తేడా ఉంది – వర్మ

Ram-Gopal-Varma2

ఎప్పటికప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసే రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా ‘సత్య 2’. ఈ సినిమా రేపు (నవంబర్ 8) హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇది అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో వర్మ అండర్ వరల్డ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.

సత్య 2 ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ‘ సత్య 2 విభిన్నంగా ఉండే క్రైమ్ కథా చిత్రం. సత్య కి సత్య 2 కి చాలా వ్యత్యాసం ఉంది, అలాగే శర్వానంద్ నటన బాగుందని’ అన్నాడు. దిల్ రాజు ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అనైక సోతి, ఆరాధన గుప్త హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

Exit mobile version