త్వరలో విడుదలకానున్న ‘కిస్’ సినిమాలో హీరో అడవి శేష్ హైదరాబాద్ లో తిరిగే ఒక దొంగగా కనిపించనున్నాడు. అతనికి ఇండియా సరిపడదని తెలుసుకుని అమెరికానే సరైన ప్రదేశం అనుకుని అక్కడకు కొత్త పేరుతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళిపోతాడు.
అమెరికాలో దిగిన తరువాత అతని ప్రయాణం ఎలా సాగింది అన్నదే సినిమా కధాంశం. ఈ సినిమాలో అడివి శేష్ మరియు ప్రియా బెనర్జీ హీరో హీరోయిన్స్. ఈ చిత్రానికి అడవి శేషే దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకల సంగీతాన్ని అందించాడు
ఈ శుక్రవారం ‘కిస్’ సినిమా మనముందుకురానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో మున్నా పాత్రలో నటించిన అడివి శేష్ మంచి మార్కులను సంపాదించుకున్నాడు