ఆ మూడే ‘అందాల రాక్షసి’ కథకి కారణం : హను

ఆ మూడే ‘అందాల రాక్షసి’ కథకి కారణం : హను

Published on Aug 6, 2012 6:15 PM IST


1990లో జరిగిన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన చిత్రం ‘అందాల రాక్షసి’. ఈ చిత్రం ఆగష్టు 10న విడుదల కానుంది. భూమి, సూర్యుడు, చంద్రుడు మధ్య ఉన్న సంబందాన్ని ఊహించుకొని ‘అందాల రాక్షసి’ కథ రాసుకున్నానని ఈ చిత్ర దర్శకుడు అంటున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఈ చిత్ర దర్శకుడు హను మాట్లాడుతూ ‘ భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఆధారంగా అందాల రాక్షసి చిత్రం మొదలైంది. వాటిని ఓ ప్రేమ కథను ముడిపెట్టిన విధానం చాలా ఆసక్తి కరంగా ఉంటుందని’ ఆయన అన్నారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ రాజమౌళి సహా నిర్మాత గా వ్యవహరించారు.

ఇది దర్శకుడిగా హను రాఘవపూడికి తొలి చిత్రం. లావణ్య, నవీన్ చంద్ర మరియు రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు.

తాజా వార్తలు