లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో చిన్న సినిమా “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటించిన ఈ చిత్రం సాలిడ్ టాక్ ని అందుకుంది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆడియెన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ తోనే మంచి హిట్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా మొన్న ఫ్రైడే విడుదల కాగా ఈ టాక్ తో సినిమా మొత్తం మూడు రోజుల్లో ఒకో రోజు కంటే ఎక్కువ మరో రోజు వసూళ్లు నమోదు అవుతూ వస్తున్నాయి. దీనితో ఈ చిన్న సినిమా మాత్రం పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించగా టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించింది. అలాగే టాలెంటెడ్ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి చేయగా అగరం సందీప్ నిర్మాణం వహించారు. నైజాంలో మైత్రి సంస్థ ఈ సినిమాని రిలీజ్ చేశారు.


