మన జీవితంలోని తీపి గుర్తుల సమూహారమే ఈ చిత్రం : శేఖర్ ఖమ్ముల

మన జీవితంలోని తీపి గుర్తుల సమూహారమే ఈ చిత్రం : శేఖర్ ఖమ్ముల

Published on Aug 7, 2012 10:51 AM IST


మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే ప్రస్తుతం మీ జీవితం సాఫీగా గడుపుతున్నట్లే. కానీ ప్రతి రోజూ ఒక కంప్యూటర్ ముందు కూర్చొని ఒకే రకమైన పనిచేయడం అనేది చాలా చిరాకు తెప్పిస్తుంది మరియు ఆ పని అంత ఆనందాన్ని కూడా ఇవ్వదు. దీనివల్ల ‘ సంతోషంగా గడిపిన అన్ని రోజులూ వెళ్ళిపోయాయి, మళ్ళీ ఆ పాత రోజులు వస్తే బాగుంటుంది’ అనే మాటల్ని తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదూ. అది నిజమే.. చాలా మంది ఇలానే ఆలోచిస్తుంటారు. ఒక కాలనీలో ఒక చిన్న రూం లో స్నేహితులతో కలిసిఉండడం, అప్పట్లో స్నేహితులతో కలిసి ఆడుకున్న ఆటలు మళ్ళీ ఎప్పుడు ఆడుతామో అని మనం ఆలోచిస్తూనే ఉంటాం.

ఈ విషయంలో మనం దర్శకుడు శేఖర్ ఖమ్ముల కి కృతఙ్ఞతలు చెప్పాలి , ఎందుకంటే ఈ మరపురాని విషయాలన్నింటినీ తన రాబోయే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చూపించనున్నారు. ‘ ఒక కాలనీలో ఉండే యువకుల జీవితాల చుటూ తిరిగే కథ ఇది. ఈ చిత్రంలో మన జీవితంలో వెళ్ళిపోయిన అందమైన జ్ఞాపకాలను చూపించాను’ అని శేఖర్ ఖమ్ముల అన్నారు. కొత్త నటీనటులు పరిచయమవుతున్న ఈ చిత్రంలో అక్కినేని అమల మరియు శ్రియ సరన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు