తెలుగు సినిమాలను 3డిలోకి మార్చడం ఎప్పుడు మొదలవుతుందో?

సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రియ జంటగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘శివాజీ’ సినిమాని 3డిలోకి మర్చి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని 3డిలో చూసిన ప్రతి ఒక్కరూ 2డి లో కంటే 3 డి లో అద్భుతంగా ఉందని చెబుతున్నారు. చేన్నకి సంబందించిన ప్రసాద్ ఈ.ఎఫ్.ఎక్స్ వారు సుమారు 400 మందితో ఈ సినిమాని 3డిలోకి మార్చారు. రజినీకాంత్ సినిమా కావడంతో 3డిలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కి కూడా చాలా చక్కని అవకాశం ఎందుకంటే గతంలో వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ని 3డిలోకి మార్చవచ్చు. 1940 నుండి నిన్న మొన్న వచ్చిన ‘మగధీర’, ‘అరుంధతి’ సినిమాల వరకూ ఎన్నో తెలుగు సినిమాలను 3డిలోకి మార్చవచ్చు.

గతంలో వచ్చిన ‘పాతాల భైరవి’, ‘ధాన వీర సూర కర్ణ’, ‘భైరవద్వీపం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ మొదలైన సినిమాలను 3డిలోకి మారిస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుంది, కానీ ఇది తెలుగు నిర్మాతలకి అంత సులువు కాదు. ఎందుకంటే మనీతో కూడిన పని, 3డి ఎఫెక్ట్స్ గురించి కొంత తెలిసి ఉండాలి, అన్ని సినిమాల్లాగా 3డి సినిమాలు ఉండవు. ముఖ్యంగా ఏ సినిమాని మారిస్తే బాగుంటుంది అనే తెలిసి ఉండాలి. ఇలాంటి ఒక ప్రయోగం చేసి ట్రెండ్ సెట్ చేసి సక్సెస్ సాదించాలి అనుకునేవాళ్లు ఇలాంటివి చెయ్యొచ్చు. 1957లో వచ్చిన ‘మాయాబజార్’ సినిమాని కలర్ లోకి మార్చి 2010లో విడుదల చేసారు. ఇలాంటి కొత్త రకమైన ప్రయోగాలతో రాబోయే కొత్తతరం ప్రేక్షకులకు గతంలో వచ్చిన ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించాలి. ఇంతకీ ఎవరు ఫస్ట్ ఈ స్టెప్ తీసుకుంటారా? అనేదే ఇక్కడి ప్రశ్న.

Exit mobile version