చెప్పి మరీ 100 కోట్లు కొట్టిన “తండేల్” టీం!

అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “తండేల్”. నాగ చైతన్య కం బ్యాక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మేకర్స్ మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదట రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు రాబట్టడం స్టార్ట్ చేసింది.

అయితే ఈ సినిమాతో నాగ చైతన్య డెఫినెట్ గా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతాడు అని ఇదే సినిమా మొదటి 100 కోట్ల మార్క్ సినిమాగా తమకి నిలుస్తుంది అని చిత్ర యూనిట్ ఎపుడు నుంచో చెబుతున్నారు. అలాగే నిర్మాత బన్నీ వాసు సన్నిహితుడు, నిర్మాత ఎస్ కె ఎన్ కూడా తండేల్ నాగ చైతన్య కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమా అవుతుంది అని ఆ మధ్య ఎప్పుడో కొన్ని నెలలు కితమే చెప్పారు. మరి ఇపుడు సీన్ కట్ చేస్తే తండేల్ రెండు వారాల లోపే ఈ మార్క్ ని కొట్టేసింది. ఇలా మొత్తానికి అయితే మేకర్స్ చెప్పి మరీ 100 కోట్లు కొట్టారని చెప్పాల్సిందే.

Exit mobile version