హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. అయితే, ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టింది.
తాజాగా ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న లేడీ స్టార్స్‌తో మరో సూపర్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తాము అడగడం వల్లే రివీల్ చేశారంటూ ఈ సినిమాలో నటిస్తున్న లేడీ స్టార్స్ పోటీ పడుతుంటారు. అయితే, దీనికి తగ్గట్టుగా మీమ్స్‌ను యాడ్ చేసి ఈ ప్రోమోను మరింత ఆసక్తికరంగా మలిచారు.
ఇక ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 11న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రకటించాడు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, లయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా జూలై 4న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.