అఖండ తాండవంతో అంచనాలు పెంచిన థమన్

‘అఖండ 2’ మూవీ నుండి తొలి సింగిల్‌ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా టీమ్‌ ముంబైలో జరిగిన ఈవెంట్‌లో మీడియాతో చిట్‌చాట్ చేసింది. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.. సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగిస్తుందని చెప్పారు. “ఇంటర్వల్ రీల్ ఒక్కటే రూ.500 విలువ ఉంటుంది. ఆ సన్నివేశం చూసి థియేటర్‌ నుంచి బయటకు వెళ్లినా సరిపోతుంది. బాలయ్య-బోయపాటి గారి కాంబినేషన్ ఎప్పటికీ బెస్ట్” అని థమన్ పేర్కొన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ 2 ను పాన్ వరల్డ్ సినిమా గా అభివర్ణించారు. ఇక బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డ మొత్తం టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. అఖండ 2 డిసెంబర్ 5న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో భారీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

14 రీల్స్ ప్లస్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ అన్నీ ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ నటన, బోయపాటి శ్రీను కథనం ప్రధాన హైలైట్స్‌గా నిలవనున్నాయి.

Exit mobile version