‘ఓజి’ ఓఎస్టి పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన థమన్!

‘ఓజి’ ఓఎస్టి పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన థమన్!

Published on Nov 12, 2025 10:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకి థమన్ ఇచ్చిన సంగీతం కూడా నెక్స్ట్ లెవెల్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా వచ్చాక ఓఎస్టీ కోసం కూడా మంచి హాట్ టాపిక్ గా నడిచింది.

ఇక ఇదే ఊపులో థమన్ ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ పై కూడా అప్డేట్ అందించేసాడు. మరి ఈ ఓఎస్టిని నవంబర్ 16న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మళ్ళీ థమన్ కొత్త అప్డేట్ తో వచ్చాడు. ఇప్పుడు ఈ ట్రాక్స్ పనుల్లోనే ఉండగా ఈ ఫస్టాఫ్ అయ్యే సరికే 22 ట్రాక్స్ వచ్చేసాయి అని తాను తెలిపాడు. అంటే ఇక మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోమని మరింత హైప్ ఎక్కిస్తున్నాడు. దీనితో ఓజి ఫ్యాన్స్ ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు