
ఇళయ దళపతి విజయ్ తాలూకా స్టార్ పవర్ సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. ఒక్క మన సౌత్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియాలోనే ఏ స్టార్ హీరో సోషల్ మీడియా అకౌంట్ లేని రీచ్ తనకి ఉంటుంది. ఇక తన సినిమాల తాలూకా ప్రమోషనల్ కంటెంట్ కి కూడా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఉంటుంది.
ఇక లేటెస్ట్ గా తన సినిమా జన నాయగన్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కి వస్తున్నా మిలియన్ వ్యూస్ సడెన్ గా పెగడంతో అవి బాట్స్ అని విజయ్ అవి మానేజ్ చేస్తున్నాడని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తుండగా దీనిపై స్వయంగా యూట్యూబ్ ఆఫీషియల్ టీం స్పందించడం జరిగింది.
ట్రాఫిక్ విషయంలో తమ దగ్గర ఒక సిస్టం ఉంటుంది అని ఒకవేళ వ్యూస్, లైక్స్ ఇంకా సబ్ స్క్రైబర్స్ లాంటివి స్టక్ అయ్యినపుడు అవి మనుషులు చేత వచ్చినవా లేక కంప్యూటర్ ప్రోగ్రాం చేసినవా అనేవి ఫిల్టర్ చేసి అప్డేట్ చేస్తామని తెలిపారు. దీనితో ఇది విజయ్ స్టార్ పవర్ అని తన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు.