మాస్ పోస్టర్ తో “మాస్టర్” రిలీజ్ ఆఫీషియల్ గా చెప్పేసారుగా.!

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం మన తెలుగులో కూడా గ్రాండ్ గానే విడుదలకు సన్నాహాలు చేసారు.

ఇక ఆ తర్వాత మళ్ళీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ విడుదలకు ప్లాన్ చేసి మరింత హైప్ తెచ్చారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ పట్ల జస్ట్ సినీ వర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం తప్ప అధికారికంగా ఓ డేట్ తో అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఓ మాస్ పోస్టర్ తో మాస్టర్ క్లాష్ కు డేట్ ను ప్రకటించేసారు.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు విజయ్ ల మధ్య అదిరిపోయే యాక్షన్ సీన్ తో వచ్చే జనవరి 13న థియేటర్స్ లోనే అని విడుదల పోస్టర్స్ ను అన్ని తమిళ్, తెలుగు, మరియు హిందీ భాషల పోస్టర్స్ తో కన్ఫర్మ్ చేసేసారు. సో ఇక ఫ్యాన్స్ అంతా ఆ డేట్ ను లాక్ చేసుకుంటే సరి. మరి ఈ నిబంధనల సమయంలో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Exit mobile version