ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తెలుసు కదా’

telusu kada

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి అలానే రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకురాలు నీరజ కోన తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ చిత్రమే తెలుసు కదా. నీరజ డెబ్యూ సినిమాగా ఈ దీపావళికి రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఒకింత డీసెంట్ టాక్ నే యువతలో అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి నేటి నుంచి ఈ సినిమా అందులో పాన్ ఇండియా భాషల్లో అలరించేందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని ఇక అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version