రజినీకాంత్ సినిమాకి మొదలైన తెలుగు డబ్బింగ్

vikram-simha

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియన్’ సినిమాకి సంబందించిన తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. తెలుగులో ‘విక్రమ సింహా’ గా రిలీజ్ చేయనున్న ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రజినీకాంత్ కి తెలుగు మంచి ఫాలోయింగ్ ఉంది, దాంతో నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

దీపిక పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటులైన శరత్ కుమార్, ఆది, శోభన, జాకీ ష్రాఫ్, నాజర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ గా గుర్తింపు చెందిన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. అలాగే అవతార్ మూవీకి పనిచేసిన స్టీరియోస్కోపిక్ టీం ఈ సినిమా కోసం పనిచేసారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

Exit mobile version