ఖరారైన తేజ కొత్త చిత్రం పేరు

ఖరారైన తేజ కొత్త చిత్రం పేరు

Published on Feb 6, 2014 3:40 AM IST

Teja

వెరైటీ దర్శకుడు తేజ కొత్తతారాగణంతో మరోసారి సరికొత్త సినిమా చేయనున్నాడు. నీకు నాకు డాష్ డాష్ తరువాత మరోసారి భారీ స్థాయి తారాగణంతో కొత్త సినిమా తీస్తున్నాడు. తప్పు అనే నామకరణం కుడా చేసాడు

ఈ ఏడాది మొదటినుంచి ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్న తేజ సినిమాకు సంబంధించిన వివరాలు గోప్యంగా వుంచాడు. తేజ చివరిసారిగా 1000అబద్ధాలు సినిమా ద్వారా మనముందుకు వచ్చాడు. సాయిరామ్ శంకర్, ఏస్తర్ హీరో హీరోయిన్స్

గతనెలలో చిత్రం బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తానంటు తేజ వార్తలలో నిలిచాడు. కొత్త వాళ్ళను పెట్టుకుని 4 కొత్త సినిమాలను తీస్తాడని సమాచారం. 2014లోనైనా తేజను అదృష్టం వరిస్తుందేమో చూద్దాం

తాజా వార్తలు