యుగాండాలో ఎంజాయ్ చేస్తున్న తషు కౌశిక్

Tashu-Kaushik
‘గ్రాడ్యుయేట్’, ‘తెలుగు అబ్బాయి’ సినిమాలలో నటించిన తషు కౌశిక్ మలయాళంలో మంచి ఆఫర్ ను అందుకుంది. ‘ఎస్కేప్ ఫ్రం యుగాండ’ మలయాళం సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్ర పోషించనుంది. రీమా కల్లింగల్ ప్రధాన పాత్రలో సాగుతున్న ఈ సినిమా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరణ జరుపుతున్నారు. యుగాండాలో అద్భుతమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తషు కౌశిక్ చాలా ఆనందంగావుంది. పార్తిబన్, ముఖేష్, రాజేష్ నటిస్తున్న ఈ సినిమాను రాజేష్ నాయర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ ఉన్ని సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమానే కాకుండా తషు ‘రిపోర్టర్’ అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది

Exit mobile version