బాలయ్య – బోయపాటి శ్రీను సినిమాలో మాజీ లవర్ బాయ్ తరుణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని తాజాగా ఓ ఇంట్రస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో ఏది నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే తరుణ్ ఈ సినిమా చేస్తే మాత్రం.. తరుణ్ సెకెండ్ ఇన్నింగ్స్ కి మంచి ఎంట్రీనే. ఇక తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గతంలో బాలయ్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.