హాలీవుడ్ సినిమాకు మూడు భాషలలో డబ్బింగ్ చెప్పనున్న తాప్సీ

హాలీవుడ్ సినిమాకు మూడు భాషలలో డబ్బింగ్ చెప్పనున్న తాప్సీ

Published on Aug 31, 2013 3:00 AM IST

Tapsee2
సౌత్ లో ‘సాహసం’ సాధించిన విజయంతో, నార్త్ లో ‘చష్మే బద్దూర్’ ఇచ్చిన ఉత్సాహంతో కెరీర్ ను కొనసాగిస్తున్న తాప్సీకి ఇప్పుడు తెలుగు,తమిళ, హిందీ భాషలలో విడుదలకానున్న ఒక హాలీవుడ్ సినిమాకు డబ్బింగ్ చెప్పనుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ‘రిడ్డిక్’. సౌత్ మరియు నార్త్ లో తాప్సీకి వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మూడు భాషలలో ఆమెనే డబ్బింగ్ చెప్పమనడం విశేషం. ఈ అవకాశాన్ని అందుకున్న తాప్సీ ఆనందానికి అవధులు లేవంట. ఒక పక్క ఆనందంగానే వున్నా మరోపక్క ముందే ఇచ్చేసిన కాల్ షీట్లను ఎలా సర్దుబాటు చెయ్యలా అని ఆలోచిస్తుందట తాప్సీ

తాజా వార్తలు