తన టాలెంట్ నిరూపించుకోవడానికి వస్తున్న తనిష్క్ రెడ్డి

తన టాలెంట్ నిరూపించుకోవడానికి వస్తున్న తనిష్క్ రెడ్డి

Published on Sep 3, 2013 12:10 AM IST

Tanisshq
టాలీవుడ్ లో మరో యంగ్ మాన్ తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్దమవుతున్నాడు. అతనే తనిష్క్ రెడ్డి, మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్, పేరున్న డాన్సర్ అయిన తనిష్క్ రెడ్డి ‘ఆ ఐదుగురు’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ మూవీని ప్రేమ్ మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. తనిష్క్ 2011లో వచ్చిన ‘దునియా’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా కథ ప్రకారం అందులో తనిష్క్ తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ నిరూపించుకునే అవకాశం లేకపోయింది. ఈ యంగ్ యాక్టర్ తన అరాబోయే సినిమాల్లో తన సిక్స్ ప్యాక్ తో కూడా ఆకట్టుకోనున్నాడు.

తాజా వార్తలు