తమిళంలో కూడా విడుదలకానున్న ‘భాయ్’

తమిళంలో కూడా విడుదలకానున్న ‘భాయ్’

Published on Aug 19, 2013 3:10 PM IST

Bhai
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా వచ్చేనెలలో విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళంలో కూడా విడుదలచేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకే సారి విడుదలకావచ్చు. ఈ సినిమా పేరు తమిళంలో కూడా ‘భాయ్’ అని తెలిసింది. ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నాగార్జున స్టైలిష్ గా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. రిచా గంగోపాద్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారి సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు