నటి తమన్నాకి విశాఖపట్నంలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆంద్ర ప్రాంతంలో సమైక్యాంద్ర ఉద్యమం మంచి జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది సమైక్యాంద్ర వాదులు తమన్నా విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగి కారు వద్దకు రాగానే ఆమె వద్దకు వచ్చి జై సమైక్యాంద్ర అనాల్సిందిగా డిమాండ్ చేశారు. తమన్నా చాలా ప్రశాంతంగా, ఎంతో చాకచక్యంగా వారికి సమాదానం చెప్పింది. తనకు అన్ని ఏరియాలు ఒక్కటేనని తన పరిస్థితిని అర్థం చేసుకోమని కోరడం జరిగింది. వారి చేతి నుండి బయటపడటానికి తను చాలా ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు పోలీసులు అక్కడకు వచ్చి సమస్యను పరిష్కరించి ఆమెని అక్కడ నుండి పంపించారు. గతంలో తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణ వాదులు నుండి మన హీరోలు హీరోయిన్స్ ఇలాంటి పరిస్థితులను ఎదురుకున్నారు.