టాక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా సాలిడ్ ట్రీట్!?

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ ఇప్పుడు మంచి ప్యాకెడ్ గా ఉందని చెప్పాలి. తన నుంచి చాలా కాలం తర్వాత ఒక్క ఏడాదిలోనే రెండు సినిమాలు రాబోతుండగా వీటి తర్వాత తన నుంచి రాబోతున్న మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”.

దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే కానుకగా సాలిడ్ ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.

ఆల్రెడీ “ఓజి” ట్రీట్ ఆరోజు ఉండొచ్చు అనే టాక్ వినిపిస్తుండగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆరోజు ఛార్జ్ తీసుకోబోతున్నాడని వినిపిస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version