మన టాలీవుడ్ టైర్ టు టాప్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ కూడా ఒకరు. లేటెస్ట్ గా “భీష్మ”తో మంచి కం బ్యాక్ అందుకున్న నితిన్ ఇక నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులను చూస్ చేసుకుంటూ వస్తున్నాడు. అలా మన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటితో ప్లాన్ చేసిన చిత్రం “చెక్”.
ఆ మధ్య విడుదల చేసిన పోస్టర్స్ తో మంచి బజ్ ను సంతరించుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను విడుదల చేశారు. ఇది మాత్రం ఒకింత కొత్తగా మరియు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. చెస్ ఆటలో మంచి ప్రావిణ్యం కలిగి ఉన్న ఆదిత్య అనే ఖైదీగా నితిన్ కనిపిస్తున్నాడు.
ఓ ఉగ్రవాది, దేశద్రోహిగా నితిన్ ను చిత్రీకరించారు. మరి ఆలాంటి రోల్ లో మంచి టాలెంట్ కలిగిన యువకుడిగా ఇందులో కనిపిస్తున్నాడు. కానీ మరోపక్క ఇన్నోసెంట్ గా కూడా కనిపిస్తున్నాడు.ఉరి శిక్షకు ఖరారు కాబడ్డ ఆదిత్యకు సపోర్ట్ చేసే ఓ లాయర్ పాత్రలోని రకుల్ ప్రీత్ కనిపించింది.
ప్రియా ప్రకాష్ రోల్ ను ఇందులో చూపించలేదు. అలాగే కళ్యాణ్ మాలిక్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా కూడా అనిపించింది. ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం మంచి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి