
‘కూలి నెం 1’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమై అనతి కాలంలోనే బాలీవుడ్ కెళ్ళి సెటిల్ అయిన పొడుగు కాళ్ళ సుందరి టబు ఇప్పుడు మరో మెట్టు పైకి ఎక్కి ‘లైఫ్ ఆఫ్ పై’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఆంగ్ లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 21న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తను ఎంతో గర్వపడే విషయం గురించి చెప్పింది. ‘ నేను సినీ రంగంలోకి ఎవరో సిఫార్సు వల్లనో లేక సపోర్ట్ వల్లనో రాలేదు. నాకు నేనుగా నటిగా నాలో ఉన్న టాలెంట్ ని నమ్ముకొని వచ్చాను. నేను సినిమాల్లోకి వచ్చే నాటికి నాకు ఎవరి మార్గనిర్దేశకం లేదు. ఎప్పుడు సీనియర్లతోనే పనిచెయ్యాలి అనుకోకుండా కొత్త వాళ్ళతో పనిచేస్తుంటే మనకు తెలియని విషయాలు ఎన్నో మనకి తెలుస్తుంటాయి. అలా మనం నేర్చుకున్న అనుభవాలే మన కెరీర్ కి చాలా ఉపయోగపడతాయి. నటిగా నేను ఎప్పుడూ గర్వపడే విషయం ఇదే. ఎన్నో రోజులుగా ఆంగ్ లీ దర్శకత్వంలో నటించాలన్న కోరిక ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాతో నెరవేరిందని’ టబు అన్నారు.