సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తాప్సీ

సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తాప్సీ

Published on Aug 4, 2012 9:37 AM IST


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సిగ్గు పడకుండా తన మనసులో మాటను దైర్యంగా చెప్పగలిగే అతి తక్కువ మంది కథానాయికలలో తాప్సీ కూడా ఒకరు. ఎలాంటి ఇంటర్వ్యూలో అయినా మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కూడా ఈ అందాల భామ తన మైండ్ లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఇండస్ట్రీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఎ.బి.ఎన్ టీవీ లో ప్రసారమయ్యే ఫేమస్ ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె’ అనే ప్రోగ్రాం లో తాప్సీ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న తొలి తెలుగు కథానాయిక కూడా తాప్సీనే.

‘ఎ.బి.ఎన్ టీవీ లో ప్రసారమయ్యే ఫేమస్ ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె’ అనే ప్రోగ్రాంలో ఇంటర్వ్యూకి ఆహ్వానించిన తొలి తెలుగు హీరొయిన్ నేనే అవ్వడం చాలా నాకు చాలా ప్రత్యేకమైనది. అలాంటి అరుదైన అవకాశం నాకు దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని’ తాప్సీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆర్.కె తన ఇంటర్వ్యూకి వచ్చిన సెలెబ్రిటీలను సెన్సేషనల్ క్రియేట్ చేసే ప్రశ్నలు అడుగుతుంటారు. గతంలో మోహన్ బాబు మరియు నాగార్జున లను ఇలాంటి ప్రశ్నలు అడిగి సంచలనం సృష్టించారు. ఈ మధ్య తాప్సీ కూడా అనవసరమైన కారణాల వాళ్ళ ఎక్కువగా న్యూస్ లో నిలుస్తోంది. ఈ మధ్య మనోజ్ మరియు మహాత్ కి మధ్య జరిగిన గొడవ కూడా తాప్సీ వల్లే జరిగింది అని తెలియడంతో మీడియా తనపై ఇంకొంచెం ఎక్కువ నిఘా పెట్టారు. అలాంటి తరుణంలో జరిగిన ఆర్.కె ఇంటర్వ్యూలో తాప్సీ ఎలాంటి వేశేశాలు తెలియజేశారో?. ప్రస్తుతం అందర్లో తను ఈ ఇంటర్వ్యూలో ఏమి చెప్పి ఉంటుందా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి.

తాజా వార్తలు