సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తుండగా ఈ చిత్రాన్ని అనాధ పిల్లల కోసం ఒక ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. లాలన వెల్ఫేర్ అసోసియేషన్ కి అనాధ పిల్లల కోసం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. లాలన్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉన్న 23 మంది అనాధ బాలబాలికలు ఈ సినిమా చూడాలని కోరగా చైర్మన్ మాధవి నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి పిల్లల కోసం ఈ ప్రదర్శన నిర్వహించారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థ స్థాపించి పదేళ్లయింది. పదేళ్ళలో ఏ సినిమా కూడా ఇలా అనాధ పిల్లలు చూడాలని అడగలేదు. రెండు రోజుల క్రితం ఇలా లాలన అసోసియేషన్ పిల్లలు చూడాలని అడుగుతన్నారని చెప్పారు. వెంటనే అర్రంగె చేసి చూపించాం. ఈ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని ఉందన్నారు.