ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. ఇక అలాగే ఈ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.
దీనితో పాటుగా మెగాస్టార్ కు ఆపోజిట్ లో ఫీమేల్ లీడ్ లో కాజల్ అగర్వాల్ ను ఓకే చెయ్యడం ఆమె ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకొని వెళ్లిపోవడం వంటివి కూడా జరిగాయి. కానీ చరణ్ కు ఫిమేల్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా సరైన క్లారిటీ ఇప్పుడప్పుడే వచ్చేలా లేదని చెప్పాలి.
కొన్నాళ్లుగా చరణ్ కు సరసన రష్మికాను ఫైనలైజ్ చేసారని టాక్ రాగా ఇప్పుడు అది మళ్ళీ మారినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పూజా హెగ్డే పేరు రేస్ లోకి వచ్చింది. మరి దీనిపై అసలైన క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.