1.5 కోట్ల మార్క్ టచ్ అవ్వనున్న సుశాంత్ అడ్డా

adda-movie-review
సుశాంత్, శాన్వీ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘అడ్డా’ సినిమా ఎవరూ ఊహించనట్టుగా ఈ నెలలో వచ్చి మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నైజాంలో ఒక కోటి రూపాయల కలెక్షన్ క్రాస్ అయ్యింది. మొత్తంగా ఈ సినిమా నైజాంలో 1.5 కోట్ల మార్క్ ని టచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సుశాంత్ కెరీర్లో ఇది రికార్డ్ మొత్తంగా చెప్పుకోవచ్చు. మిగతా సినిమాలేవీ బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. చింతలపూడి శ్రీనివాస్ – నాగ సుశీల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీ గా ఉన్న సుశాంత్ తన రాబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Exit mobile version