ప్రముఖ తమిళ తారలు సూర్య మరియు కార్తి లు తెలుగు పరిశ్రమ లో నిలదొక్కుకునేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ విజయాలతో మంచి పేరు సంపాదించుకున్న ఈ అన్నదమ్ములు ఈ మధ్యనే మాదాపూర్ లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు ఈ పని చెయ్యటం ద్వారా ఇక్కడ బిజినెస్ మీద వారి ప్రభావం చూపించాలి అనుకుంటున్నారు. సూర్య ఇప్పటికే తన పారితోషకం తో పాటు అనువాద హక్కులను కూడా అడుగుతున్నారు. కార్తి తెలుగు లో అద్బుతంగా మాట్లాడగలరు కాబట్టి ఇక్కడి హీరో లానే అనిపిస్తారు తెలుగు లో ఏ పెద్ద హీరో అయిన సృష్టించే మార్కెట్ ని ఈ సోదరులు సృష్టించగలరు. ఈ సోదరులు నటించే ఏ తమిళ చిత్రం అయిన తెలుగు అనువాదం అవుతుంది ఒకటి రెండు నేరు చిత్రాలు కూడా చెయ్యనున్నారు. ఈ సోదరులు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఇలా ఎప్పుడు చేస్తారో వేచి చూడాలి.